హిందీలో భారీ వసూళ్లతో తొలిరోజు చరిత్ర సృష్టించిన 'కేజీఎఫ్-2' సినిమా
- తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'కేజీఎఫ్-2'
- తొలిరోజు రూ.53.95 కోట్లు రాబట్టిన వైనం
- అంతకు ముందు 'వార్' సినిమాకు తొలిరోజు రూ.51.60 కోట్లు
- 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' కి రూ.50.75 కోట్లు
- వివరాలు వెల్లడించిన తరణ్ ఆదర్శ్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కేజీఎఫ్-2' సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది. యశ్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమా హిందీలో రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపారు.
'తొలిరోజు వసూళ్లలో 'కేజీఎఫ్-2' చరిత్ర సృష్టించింది. 'వార్', 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాలు మొదటి రోజు వసూళ్లలో సృష్టించిన రికార్డులను కేజీఎఫ్ బద్దలు కొట్టింది. హిందీలో ఇప్పుడు 'కేజీఎఫ్-2' తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది' అని తరణ్ ఆదర్శ్ చెప్పారు.
'కేజీఎఫ్-2' తొలిరోజు రూ.53.95 కోట్లు రాబట్టగా, అంతకు ముందు 'వార్' సినిమా తొలి రోజు రూ.51.60 కోట్లు, 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' రూ.50.75 కోట్లు రాబట్టిందని వివరించారు.