పారిశ్రామిక ప్రమాదాలపై కూడా ‘పేలాలు’ ఏరుకోవడం ఏంటి అయ్యన్నా?: విజ‌య‌సాయిరెడ్డి

  • గోదావరి పుష్కరాల్లో బాబు షూటింగ్ సరదాకు 30 మంది చనిపోయార‌న్న విజ‌య‌సాయిరెడ్డి 
  • అమాయకులు చనిపోతే ఎంత మంది మంత్రులు పరిగెత్తుకెళ్లారని ప్ర‌శ్న‌
  • మృతుల్లో ఉత్తరాంధ్ర భక్తులే ఎక్కువ అని వ్యాఖ్య‌
  • ఆ టైంలో ఏ రాచకార్యాల్లో మునిగావని నిల‌దీత‌
ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో ప్ర‌మాదం జ‌రిగిన ఘ‌ట‌న‌పై టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేత‌ విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన ప్రాంతానికి పరిగెత్తుకుని వెళ్లాల్సిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారని అయ్య‌న్న పాత్రుడు చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. 

'పారిశ్రామిక ప్రమాదాలపై కూడా ‘పేలాలు’ ఏరుకోవడం ఏంటి అయ్యన్నా? గోదావరి పుష్కరాల్లో బాబు షూటింగ్ సరదా కారణంగా 30 మంది అమాయకులు చనిపోతే ఎంత మంది మంత్రులు పరిగెత్తుకెళ్లారు? మృతుల్లో ఉత్తరాంధ్ర భక్తులే ఎక్కువ. ఆ టైంలో నీవు ఏ రాచకార్యాల్లో మునిగావు? ఇప్పుడు నీతులు చెబుతున్నావు' అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News