కొల్హాపూర్ టెక్కీ తీసిన ఫొటో యాపిల్ కు తెగ నచ్చేసింది..!
- యాపిల్ ఫొటో కంటెస్ట్ లో విజేతగా అవతరణ
- సాలెగూడుపై నీటి బిందువులే అతడు తీసిన ఫొటో
- ముత్యాల హారంగా ఆకర్షించే దృశ్యం
- ఐఫోన్ మ్యాక్రో సెన్సార్ పనితీరుకు నిదర్శనం
మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన ఐటీ ఇంజనీర్ ప్రజ్వల్ చోగుల్ ఐఫోన్ తో ఫొటో తీసి యాపిల్ పోటీలో విజేతగా నిలిచాడు. యాపిల్ ‘షాట్ ఆన్ ఐ ఫోన్’ పేరుతో ఒక ఫొటోగ్రఫీ పోటీని నిర్వహించింది. 2022 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 16 వరకు ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ పోటీలో మరో తొమ్మిది మందితోపాటు ప్రజ్వల్ కూడా విజేతగా అవతరించాడు. మిగిలిన విజేతలు చైనా, హంగరీ, స్పెయిన్, ఇటలీ, థాయిల్యాండ్, అమెరికా నుంచి ఉన్నారు.
ప్రజ్వల్ చోగుల్ ఫొటోను గూగుల్ తన వెబ్ సైట్లో పోస్ట్ చేసింది. యాపిల్ ఇన్ స్టా గ్రామ్ పేజీలోనూ ఇది దర్శనమిస్తోంది. ఎంపిక చేసిన పట్టణాల్లోని బిల్ బోర్డులపైనా ప్రదర్శిస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రోలో ఉన్న మ్యాక్రో కెమెరా సెన్సార్ ప్రాధాన్యం తెలియజేసేందుకే యాపిల్ ఈ పోటీ నిర్వహించింది. దీంతో ప్రజ్వల్ చోగుల్ ఐఫోన్ తో.. సాలెగూడుఫై నీటి బిందువులు పడిన దృశ్యాన్ని ఫొటోగా తీసి పంపాడు. పొడిగా ఉండే సాలెగూడు నీటి బిందువులతో నెక్లెస్ మాదిరి, ముత్యాల హారం మాదిరిగా మారిపోవడం తన కళ్లను ఆకర్షించినట్టు ప్రజ్వల్ తెలిపాడు.