ట్విట్టర్ ను ఎందుకు కొనేదీ..? బయట పెట్టిన ఎలాన్ మస్క్
- స్వేచ్ఛగా మాట్లాడే వేదికగా ట్విట్టర్ ఉండాలన్న మస్క్
- ప్రస్తుత రూపంలో అది సాధ్యం కాదని వివరణ
- నా పెట్టుబడులతో ఈ విషయం అర్థమైందన్న మస్క్
- ప్రైవేటు కంపెనీగా మారాలంటూ అభిప్రాయ వ్యక్తీకరణ
టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 43 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ లో నూరు శాతం వాటాను కొనుగోలు చేస్తానంటూ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు అందరి మతి పోగొడుతోంది. భవిష్యత్తును బాగా అంచనా వేయడంలో మస్క్ కు ఎంతో నైపుణ్యం ఉంది. ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ కు ఇప్పటికే 9.2 శాతం వాటాలు ఉన్నాయి. ఇక ట్విట్టర్ ను కొనడం వెనుక మస్క్ ఆలోచన ఏమై ఉండొచ్చు..? ఇప్పుడు ఎంతో మందిని వేధిస్తున్న సందేహం ఇది.
ఈ క్రమంలో తన సంచలన నిర్ణయం వెనుక కారణాలను మస్క్ వివరించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే వేదికగా ట్విట్టర్ కు సామర్థ్యాలు ఉన్నాయని భావించి నేను పెట్టుబడులు పెట్టాను. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా మాట్లాడగలగడం సామాజిక ఆవశ్యకతగా నేను భావిస్తున్నాను. అయితే, ట్విట్టర్ ప్రస్తుత రూపంలోనే కొనసాగితే సామాజిక ఆవశ్యకతకు మద్దతుగా నిలవదని, నేను పెట్టుబడులు పెట్టిన తర్వాత నాకు అర్థమైంది. ఇందుకోసం ట్విట్టర్ ప్రైవేటు కంపెనీగా అవతరించాలి’’ అని ఎలాన్ మస్క్ స్టాక్ ఎక్సేంజ్ లకు సమాచారం ఇచ్చారు. ట్విట్టర్ లో వాటాల ద్వారా తాను డబ్బు ఆశించడం లేదని మస్క్ లోగడే స్పష్టం చేశారు.