పంజాబ్ కింగ్స్ కోచ్ జాంటీరోడ్స్ చేసిన పనితో అవాక్కయిన సచిన్
- పంజాబ్ - ముంబై మ్యాచ్ తర్వాత పరస్పర అభినందనలు
- ఎదురుపడ్డ సచిన్, జాంటీ రోడ్స్
- సచిన్ పాదాలను తాకబోయిన రోడ్స్
- అడ్డుకుని, హత్తుకున్న సచిన్
క్రికెట్ లెజెండ్, భారత రత్న సచిన్ టెండూల్కర్ ను.. క్రికెట్ ప్రపంచంలో అభిమానించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సైతం తనకు సచిన్ ఆరాధనీయ వ్యక్తి అని రుజువు చేశారు. ఇందుకు పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా నిలిచింది.
బుధవారం రాత్రి పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగడం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సభ్యులు ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టుకు ఫీల్డింగ్, బ్యాటింగ్ కోచ్ గా సేవలు అందిస్తున్న జాంటీరోడ్స్ కూడా వరుసలో నించున్నారు. అటు ముంబై బృందంలో ఆ జట్టు మెంటార్ గా వ్యవహరిస్తున్న సచిన్ కూడా ఉన్నాడు.
సచిన్ దగ్గరకు రాగానే జాంటీరోడ్స్ కిందకు వంగి సచిన్ పాదాలను తాకబోయారు. అది ముందే గమనించిన సచిన్ రోడ్స్ ను ముందుకు నెట్టేసి ఆ పనిచేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత చిరునవ్వు చిందిస్తూ రోడ్స్ ను హత్తుకున్నారు. జాంటీ రోడ్స్ చూపిన గౌరవానికి చాలా మంది నెటిజన్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.