రాజస్థాన్‌ను చిత్తుచేసి అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్
- రాజస్థాన్‌పై 37 పరుగుల తేడాతో విజయం
- పాండ్యా, మిల్లర్ మెరుపులతో భారీ స్కోరు
- లక్ష్య ఛేదనలో తడబడిన రాయల్స్
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా పాండ్యా
ఐపీఎల్లో భాగంగా గత రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి 37 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ కెప్టెన్ పాండ్యా వీరబాదుడుకు తోడు మిల్లర్ మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం 193 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
ఓపెనర్ జోస్ బట్లర్ 24 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ (54) చేశాడు. జట్టులో అతడు మాత్రమే రాణించాడు. ఆ తర్వాత షిమ్రన్ హెట్మెయిర్ చేసిన 29 పరుగులే రెండో అత్యధికం కావడం గమనార్హం. మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాట్ ఝళిపించలేకపోయారు. కెప్టెన్ శాంసన్ 11, రియాన్ పరాగ్ 18, నీషమ్ 17 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో యష్ దయాళ్ , లాకీ ఫెర్గ్యూసన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్‌కు ఆరంభం కలిసి రాలేదు. 53 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. వేడ్ (12), విజయ్ శంకర్ (2), శుభమన్ గిల్ (13) తీవ్రంగా నిరాశ పరిచారు. అయితే, హార్దిక్ పాండ్యా, అభినవ్ మనోహర్, మిల్లర్లు జట్టును ఆదుకున్నారు. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసి మనోహర్ అవుటయ్యాక మిల్లర్ క్రీజులోకి వచ్చాడు. అతడి రాకతో ఆట స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. పాండ్యా, మిల్లర్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇద్దరూ కలిసి పోటీలు పడి బౌలర్ల పని పట్టారు. దీంతో స్కోరుబోర్డు పరుగులు తీసింది.
పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87, మిల్లర్ 14 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో గుజరాత్ 8 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రాజస్థాన్ 6 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. తనకూ అన్ని పాయింట్లే ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ రెండో స్థానంలో ఉంది.