హార్దిక్ పాండ్యా కెప్టెన్ ఇన్నింగ్స్... అభినవ్, మిల్లర్ మెరుపులు... గుజరాత్ భారీ స్కోరు

  • ముంబయిలో గుజరాత్ వర్సెస్ రాజస్థాన్
  • మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు
  • హార్దిక్ పాండ్యా 87 నాటౌట్
రాజస్థాన్ రాయల్స్ తో పోరులో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధ్యతగా ఆడుతూ, అర్ధసెంచరీ నమోదు చేసుకున్న వేళ గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్ ను హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ లతో కలిసి మెరుగైన భాగస్వామ్యాలతో స్కోరుబోర్డును ముందుకు ఉరికించాడు. 

అభినవ్ మనోహర్, మిల్లర్ మెరుపుదాడి చేయడంతో గుజరాత్ కు భారీ స్కోరు సాధ్యమైంది. అభినవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 43 పరుగులు చేయగా, మిల్లర్ 14 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మిల్లర్ స్కోరులో 5 ఫోర్లు, ఒక భారీ సిక్సు ఉన్నాయి.

అంతకుముందు ఓపెనర్లు మాథ్యూ వేడ్ 12, శుభ్ మాన్ గిల్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. వన్ డౌన్ లో వచ్చిన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 2 పరుగులు చేసి నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ 1, చహల్ 1, రియాన్ పరాగ్ 1 వికెట్ తీశారు.


More Telugu News