ఐదు లక్షల మందిని రష్యా భూభాగంలోకి బలవంతంగా తీసుకెళ్లారు: జెలెన్ స్కీ

  • ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • రష్యా బలగాల అకృత్యాలకు పాల్పడుతున్నాయన్న జెలెన్ స్కీ
  • ఎస్తోనియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగం
  • రష్యాను అడ్డుకునే శక్తి ఈయూకి ఉందని స్పష్టీకరణ
ఉక్రెయిన్ పై ఫిబ్రవరి 24 నుంచి భీకర దాడులు చేస్తున్న రష్యా అనేక అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తాజాగా సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. రష్యా ఐదు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను ఎత్తుకెళ్లిందని ఆరోపించారు. వారిని బలవంతంగా రష్యాలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరుల కీలక పత్రాలను, వ్యక్తిగత వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు కూడా రష్యా ప్రయత్నిస్తోందన్నారు. 

అంతేకాదు, రష్యన్లు ఉక్రెయిన్ చిన్నారులను దత్తత చట్టవ్యతిరేక రీతిలో దత్తత తీసుకునే ప్రయత్నాలు కూడా చేశారని జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ పై దాడుల్లో రష్యా బలగాలు ప్రమాదకర ఫాస్ఫరస్ బాంబులు వినియోగిస్తోందని, టెర్రర్ వ్యూహాలతో ఉక్రెయిన్ ప్రజల అణచివేతకు పాల్పడుతోందని వివరించారు. 

ఎస్తోనియా పార్లమెంటును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన ఈ మేరకు ఆరోపించారు. జరుగుతున్న దారుణాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్పందించాలని, రష్యాను అడ్డుకునే శక్తి ఈయూకి ఉందని ఉద్ఘాటించారు.


More Telugu News