కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ.. ధాన్యం కొనుగోళ్ల కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్
- ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం
- ఎఫ్‌సీఐకి తరలించే సమయంలోనే అవకతవకలు
- టీఆర్ఎస్ ముఖ్యుల పాత్ర తేల్చాలన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని, సదరు కుంభకోణంపై సీబీఐ చేత విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు.
తెలంగాణలో గడచిన ఏడేళ్లుగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని, అయితే అందులో భారీ కుంభకోణం దాగి ఉందని తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత దానిని ఎఫ్‌సీఐ గోదాములకు తరలించే ప్రక్రియలోనే ఈ కుంభకోణం జరుగుతోందని ఆయన వివరించారు. సీబీఐతో ఈ దందాపై విచారణ చేయించి ఈ కుంభకోణంలో టీఆర్ఎస్ ముఖ్యులతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిని నిగ్గు తేల్చాలని రేవంత్ రెడ్డి ఆ లేఖలో కిషన్ రెడ్డిని కోరారు.