తమిళంలో 'ఆహా'.. సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం!
- అచ్చమైన తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా'
- పలు భాషల్లోకి విస్తరిస్తున్న ఓటీటీ సంస్థ
- కాసేపట్లో తమిళ ప్రసారాలు ప్రారంభం
అచ్చమైన తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' తక్కువ కాలంలోనే ఎంతో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. వివిధ భాషల్లోకి కూడా విస్తరించడం మొదలు పెట్టింది. తాజాగా తమిళంలో సైతం అడుగుపెట్టబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తమిళ్ లోగో లాంచింగ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది.
ఇక ఈరోజు తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఓటీటీ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా కాసేపట్లో తమిళ్ 'ఆహా' కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం చెన్నైలోని లీలా ప్యాలస్ లో జరగబోతోంది. దక్షిణాదికి చెందిన కన్నడ, మలయాళ భాషల్లోనూ 'ఆహా' ప్రసారాలు మొదలు కానున్నాయి.