బాలీవుడ్ కు మండిపోయే ప్రశ్న వేసిన రామ్ గోపాల్ వర్మ

  • హిందీలో ఘన విజయం సాధిస్తున్న దక్షిణాది చిత్రాలు
  • దక్షిణాది సినిమాలను ప్రశంసిస్తూ వర్మ ట్వీట్
  • 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2' చిత్రాల గురించి బాలీవుడ్ ఏమనుకుంటోందని ప్రశ్న
తన మనసులోని మాటను ఏమాత్రం సంకోచించకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నైజం. ఎవరు ఏమనుకుంటారనేది ఆయనకు అనవసరం. ఆ తర్వాత తనకు ఎదురయ్యే విమర్శలను కూడా ఆయన అస్సలు పట్టించుకోరు. 

తాజాగా బాలీవుడ్ కు మండిపోయే ప్రశ్నను వర్మ సంధించారు. దక్షిణాది సినిమాలు హిందీలో సైతం విడుదలవుతూ భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మన సినిమాలను ప్రశంసిస్తూ, హిందీ సినిమాలను తక్కువ చేసేలా వర్మ ట్వీట్ చేశారు. 

బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ (తొలిరోజు వసూళ్లు) సినిమాల జాబితాను వర్మ ట్విట్టర్ లో షేర్ చేశారు. 'హిందీ సినిమా చరిత్రలో కన్నడ డబ్బింగ్ సినిమా 'కేజీఎఫ్ 2', తెలుగు డబ్బింగ్ సినిమా 'బాహుబలి 2'లు బిగ్గెస్ట్ ఓపెనర్లుగా నిలవడంపై హిందీ పరిశ్రమ (బాలీవుడ్) ఏమి ఆలోచిస్తోందని మీరు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. నెటిజెన్లు దీనిపై విపరీతంగా స్పందిస్తున్నారు. 


More Telugu News