మంత్రి పదవులు కోల్పోయిన వారు అవినీతిపరులా? అసమర్ధులా?: తులసిరెడ్డి

  • 13 మందిని ఏ కారణంతో తొలిగించారన్న తులసిరెడ్డి
  • మంత్రిమండలి కాదు, భజన మండలి అని కామెంట్ 
  • సకల శాఖల మంత్రి సజ్జల అంటూ విమర్శలు
గతంలో బడ్జెట్ లీక్ అయిందన్న కారణంతో మాజీ సీఎం ఎన్టీరామారావు మంత్రులందరినీ తొలగించారని, కానీ నేడు కారణం చెప్పకుండానే సీఎం జగన్ తన మంత్రులను తొలగించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శించారు. 24 మంది మంత్రుల్లో 13 మందిని తొలగించారని, వారిని ఏ కారణంతో తొలగించారో చెప్పలేదని అన్నారు. క్యాబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన వారందరూ అవినీతిపరులు అనుకోవాలా? లేక అసమర్థులు అనుకోవాలా? అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని గుండువారిపల్లిలో ఓ పెళ్లి వేడుకకు హాజరైన సందర్భంగా తులసిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇది జగన్ ప్రభుత్వ మంత్రిమండలి కాదని, ఆయన భజన మండలి అని తులసిరెడ్డి అభివర్ణించారు. వారు మంత్రులు కాదని, జగన్-భారతి ఎస్టేట్ లో నిమిత్తమాత్రులైన సేవకులు అని పేర్కొన్నారు. సకల శాఖల మంత్రి సజ్జలేనని వ్యాఖ్యానించారు.


More Telugu News