స్వ‌ల్ప‌మేన‌ని చెప్పి భారీగా బాదేస్తున్నారు... ఆర్టీసీ చార్జీల‌పై నారా లోకేశ్

  • ప్ర‌క‌ట‌న‌కు, చార్జీల పెంపున‌కు సంబంధం లేదన్న లోకేశ్ 
  • కిలో మీట‌ర్‌కు ఇంత అంటూ చార్జీల మోత‌ అంటూ విమర్శ 
  • పాస్‌లు, ఏసీ బ‌స్సుల్లో బాదుడే బాదుడు అన్న లోకేశ్
ఏపీలో ఆర్టీసీ చార్జీల‌ను పెంచిన వైసీపీ స‌ర్కారు తీరుకు నిర‌స‌న‌గా గురువారం టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు తెర తీశాయి. ఈ క్ర‌మంలో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్... ఆర్టీసీ చార్జీల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్వ‌ల్పంగానే చార్జీల‌ను పెంచుతున్నామ‌ని చెప్పిన ఆర్టీసీ అధికారులు జ‌నంపై మోయ‌లేని భారాన్ని మోపుతున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు కూడా బాదుడులో సీఎం జ‌గ‌న్‌ను ఆద‌ర్శంగా తీసుకున్న‌ట్టు ఉంద‌ని కూడా ఆయ‌న సెటైర్లు సంధించారు. 

డీజిల్ సెస్ పేరిట టికెట్‌పై మాత్ర‌మే చార్జీని పెంచామ‌ని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా..ఆచ‌ర‌ణ‌లో మాత్రం ఆర్టీసీ చార్జీల‌ను భారీగానే పెంచారంటూ లోకేశ్ ఆరోపించారు. ప‌ల్లె వెలుగు బ‌స్సులో క‌నీసం రూ.10 టికెట్‌ను వ‌సూలు చేస్తుండ‌గా.. 5 కిలో మీట‌ర్ల త‌ర్వాత కిలో మీట‌ర్‌కు 10 పైస‌ల వంతున వ‌డ్డిస్తున్నార‌ని తెలిపారు. ఇత‌ర స‌ర్వీసుల్లో కనిష్ఠంగా రూ.30, గరిష్ఠంగా రూ.120 మేర బాదేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. పాస్‌లు, ఏసీ బ‌స్సుల్లో బాదుడుకు అడ్డూ అదుపూ లేకుండా పోయింద‌ని కూడా లోకేశ్ ధ్వ‌జ‌మెత్తారు.


More Telugu News