కిలో తరుగు తీసినా మిల్లు మూతే... రైస్ మిల్లర్లకు తెలంగాణ మంత్రి వార్నింగ్
- వేల్పూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
- తేమ లేకుండా ధాన్యం తీసుకురావాలని రైతులకు వినతి
- చేతివాటం ప్రదర్శిస్తే సహించేది లేదంటూ మిల్లర్లకు హెచ్చరిక
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైపోయాయి. సీఎం కేసీఆర్ నుంచి ప్రకటన వచ్చినంతనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైపోతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని వేల్పూరులో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఇటు రైతులకు సూచనలు చేరయడంతో పాటుగా ధాన్యం కొంటున్న రైస్ మిల్లర్లకు మంత్రి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మేరకు కనీస మద్దతు ధర లభించాలంటే.. తేమ లేకుండా ధాన్యాన్ని ఎండబెట్టుకుని మరీ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని ఆయన రైతులకు సూచించారు.
అదే సమయంలో రైతుల వద్ద చేతివాటం ప్రదర్శించేందుకు యత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన రైస్ మిల్లర్లకు హెచ్చరికలు జారీ చేశారు. మంచి ధాన్యం నుంచి కిలో తరుగు తీసినా రైస్ మిల్లును మూసివేస్తామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.