కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి
- ప్రమాదంలో ప్రాణనష్టం తీవ్రంగా కలచివేసిందన్న ఉపరాష్ట్రపతి
- మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన వెంకయ్య
- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్
ఏలూరు జిల్లా పరిధిలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రమాదంపై స్పందిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు.
కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పిన వెంకయ్య.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదే విధంగా ప్రమాదంలో గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలంటూ ఆయన ఆకాంక్షించారు.