నేటి నుంచి రియల్ మీ ఫ్లాగ్ షిప్ ఫోన్ ‘జీటీ2 ప్రో’ అమ్మకాలు
- ఫ్లిప్ కార్ట్, రియల్ మీ పోర్టళ్లలో విక్రయాలు
- దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ స్టోర్లలోనూ లభ్యం
- వేగవంతమైన పనితీరు చూపిస్తుందంటూ కంపెనీ ప్రకటన
- హెచ్ డీఎఫ్ సీ కార్డుపై రూ.5,000 డిస్కౌంట్
రియల్ మీ ఫ్లాగ్ షిప్ ఫోన్ జీటీ2 ప్రో విక్రయాలు మొదటిసారి గురువారం నుంచి మొదలు అవుతున్నాయి. వేగవంతమైన పనితీరు అనుభవాన్ని ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ అంటోంది. వన్ ప్లస్ 10 ప్రో, మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 22లకు ఇది పోటీ ఇవ్వనుంది. ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో వస్తున్న తక్కువ రేటు ఫోన్ ఇదే.
8జీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ రకం ధర రూ.49,999. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ రకం ధర రూ.57,999. మొదటి సేల్ లో కొనుగోలు చేసే వారికి కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్, రియల్ మీ పోర్టళ్లపై మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు మొదలవుతాయి. అంతేకాదు సమీపంలోని షాపుల్లోనూ నేటి నుంచి విక్రయాలకు జీటీ 2 ప్రో అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 1 ప్రాసెసర్ ఇందులో ఉంటుంది. ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ కావడంతో ఎటువంటి ల్యాగ్స్ ఉండవని, అవాంతరాల్లేని, వేగవంతమైన అనుభవం లభిస్తుందని రియల్ మీ తెలిపింది. దీని డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. బయోపాలిమర్స్ తో తయారైన మొదటి ఫోన్ ఇది. దీని వల్ల పర్యావరణానికి హాని ఉండదు. 2కే ఎల్టీపీO2 డిస్ ప్లే ఉంటుంది. స్క్రీన్ రీఫ్రెష్ రేటు గరిష్ఠంగా 120 గిగాహెర్జ్. చేస్తున్న టాస్క్ ఆధారంగా రీఫ్రెష్ రేటు దానంతట అదే మారుతుంది.