వీహెచ్ ఇంటిపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు సిద్ధార్థ్!
- సీసీటీవీ ఫుటేజీ పరిశీలన ద్వారా నిందితుడి గుర్తింపు
- నిందితుడు యూపీకి చెందిన యువకుడు
- గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- దాడికి కారణమేమిటన్న విషయంపై ఆరా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఇంటిపై జరిగిన దాడి తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మరుక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు.
దాడికి సంబంధించి రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. ఎట్టకేలకు నిందితుడు ఎవరన్న విషయాన్ని నిగ్గు తేల్చారు. అంతేకాకుండా అతడిని అదుపులోకి కూడా తీసుకున్నారు. వీహెచ్ ఇంటిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సిద్ధార్థ్‌గా గుర్తించిన పోలీసులు.. కొన్ని గంటల వ్యవధిలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే అతడి అరెస్ట్‌ను పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. యూపీకి చెందిన వ్యక్తి వీహెచ్ ఇంటిపై దాడి చేయడానికి గల కారణమేమిటన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఇదే విషయంపై పోలీసులు నిందితుడి నుంచి వివరాలు రాబట్టే యత్నం చేస్తున్నట్లుగా సమాచారం.