వీహెచ్ ఇంటిపై రాళ్లదాడి నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి
- వీహెచ్ ఇంటిపై దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి
- దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
- శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆగ్రహం
హైదరాబాద్, అంబర్‌పేటలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీపీసీసీ నేతలు మండిపడుతున్నారు. వీహెచ్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోనులో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
దాడి జరిగిన తీరుపై ఆయనకు వీహెచ్ వివరించారు. వీహెచ్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. కాంగ్రెస్ నేతలపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆయన చెప్పారు. వి.హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.