మరింత తగ్గిన కరోనా విస్తృతి.. దేశంలో కొత్తగా 1,007 కేసుల నమోదు
- గడచిన 24 గంటల్లో 26 మంది మృతి
- 0.03 శాతానికి తగ్గిన యాక్టివ్ కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 818 మంది
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ విస్తృతి మరింతగా తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశంలో 1,007 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 818 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. వెరసి రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా.. యాక్టివ్ కేసుల శాతం 0.03 శాతానికి తగ్గిపోయింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,058 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇక గడచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్ కారణంగా 26 మంది చనిపోయారు. తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,30,39,025కు చేరుకోగా.. మరణాల సంఖ్య 5,21,736కు చేరుకుంది. ఇక కరోనా బారిన పడి రికవరీ అయిన వారి సంఖ్య 4,25,02,454కు చేరుకుంది.