వైవాహిక జీవితంలోకి మహిళా గ్రాండ్‌మాస్టర్ ప్రత్యూష.. పాయకరావుపేటలో నేడు వివాహం
- చార్టెడ్ అకౌంటెంట్ రవితేజతో నేడు వివాహం
- నాలుగేళ్ల పసిప్రాయం నుంచే చెస్‌పై మక్కువ
- అండర్-9 విభాగంలో ప్రపంచ చాంపియన్
చదరంగం క్రీడాకారిణి బొడ్డా ప్రత్యూష వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. చెస్ ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అయిన ప్రత్యూష వివాహం నేడు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వంగలపూడి రవితేజతో జరగనుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని జగతా అప్పారావు కల్యాణమండపంలో వీరి వివాహం ఘనంగా జరగనుంది.
నాలుగేళ్ల పసిప్రాయం నుంచే చెస్ ఆడుతున్న ప్రత్యూష ఎన్నో విజయాలను సొంతం చేసుకుని మహిళా గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగారు. అండర్-9 విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ప్రత్యూష.. అండర్-12, అండర్-14, అండర్-16, అండర్-18 విభాగాల్లో కామన్‌వెల్త్ చాంపియన్‌గా నిలిచారు. అలాగే, అండర్-16 ఏషియన్ చాంపియన్‌షిప్‌ను కూడా కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో తన పేరున ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ చెస్ అకాడమీ ద్వారా ఎంతోమందికి శిక్షణ ఇస్తున్నారు.