తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్
- 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సీఎం ప్రకటన
- తొలి విడతలో 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి
- రెండో విడతలో 3,334 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలే చెబుతోంది. ఇప్పటికే 80 వేల పై చిలుకు ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... తెలంగాణ ఆర్థిక శాఖ తొలి విడతలో భాగంగా 30,453 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో విడతలో భాగంగా బుధవారం నాడు మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రెండో విడతలో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వాటిలో ఎక్సైజ్, ఫారెస్ట్, అగ్ని మాపక శాఖలకు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ.. మిగిలిన శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అనుమతులపై దృష్టి సారించింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించిన ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.