తెలంగాణ‌లో వ‌యో ప‌రిమితి పెంపు.. ఏఏ ఉద్యోగాలకంటే..!

  • యూనిఫాం ఉద్యోగాల‌కు మూడేళ్ల వ‌యో ప‌రిమితి పెంపు
  • రెండేళ్ల పాటు అమ‌లులో వ‌యో ప‌రిమితి పెంపు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ‌
తెలంగాణ‌లో ఉద్యోగ నియామ‌క ప్రక్రియ మొద‌లు కాగా... తాజాగా నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. ఉద్యోగాల భ‌ర్తీ కోసం సిద్ధ‌మ‌వుతున్న నిరుద్యోగుల‌కు వ‌యో ప‌రిమితిని మూడేళ్లు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే అన్ని ర‌కాల ఉద్యోగాల‌కు కాకుండా కేవ‌లం యూనిఫాం ఉద్యోగాల‌కు మాత్ర‌మే ఈ వ‌యో ప‌రిమితి పెంపు వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

తెలంగాణ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం పోలీస్‌, ఎక్సైజ్‌, అగ్నిమాప‌క‌, జైళ్లు, అట‌వీ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగాల‌కు ఈ వ‌యో ప‌రిమితి వ‌ర్తించ‌నుంది. గరిష్ఠ వ‌యో ప‌రిమితిని మూడేళ్ల‌కు పెంచిన ప్ర‌భుత్వం... ఈ వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు రెండేళ్ల పాటు అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది.


More Telugu News