కాంగ్రెస్ నాకు ద్రోహం చేసింది... హార్దిక్ పటేల్ ఆరోపణ
- పటీదార్ల ఆందోళనకు హార్దిక్ నేతృత్వం
- ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిక
- ఇప్పుడు అదే కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన వైనం
గుజరాత్‌లో కొన్నేళ్ల క్రితం పటీదార్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భంలో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన హార్దిక్ పటేల్.. ఆ తర్వాత చోటుచేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. నాటి నుంచి పెద్దగా బయటకే రాని హార్దిక్ బుధవారం అనూహ్యంగా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానానికి బీజం వేసిన కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు.
బుధవారం నాడు తన ఇంటిలో పలువురు మీడియా ప్రతినిధులను కలిశానని చెప్పిన హార్దిక్ పటేల్.. తనను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు. పటీదార్ల ఆందోళనలతో 2017 ఎన్నికల్లో బాగానే లబ్ధి పొందిన కాంగ్రెస్ పార్టీ తనను మాత్రం పక్కకు తప్పించేసిందని ఆయన ఆరోపించారు.