అసోంలో విషాదం... పుట్టగొడుగులు తిని 13 మంది మృత్యువాత
- మృతుల్లో ఇద్దరు చిన్నారులు
- దిబ్రూగఢ్ జిల్లాలో ఘటన
- మృతులంతా తేయాకు కార్మికులు
ఈశాన్య రాష్ట్రం అసోంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పుట్టగొడుగులు తిన్న 13 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో మృత్యువాత పడ్డ వారంతా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు. అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారిని అధికారులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. వీరిలోని కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.