రష్యా నుంచి వచ్చేస్తున్న ఇన్ఫోసిస్.. అక్కడ ఐటీ కార్యకలాపాలు నిలిపేస్తూ నిర్ణయం
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం
- ఈ కారణంగా రష్యాపై ఆంక్షల పరంపర
- యుద్ధం కారణంగా కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ప్రకటన
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యాపై ఇంకా ఆంక్షల పరంపర కొనసాగుతూనే ఉంది. యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నదంటూ రష్యాపై ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆయా దేశాలతో పాటు పలు వాణిజ్య సంస్థలు కూడా రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా ఇదే బాటలో నడిచింది.
రష్యాలో తన ఐటీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లుగా ఇన్ఫోసిస్ కాసేపటి క్రితం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగానే రష్యాలో ఐటీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లుగా ఇన్ఫోసిస్ ప్రకటన చేసింది. సంస్థ ప్రకటన నేపథ్యంలో రష్యాలో ఇన్ఫోసిస్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.