టాస్ గెలిచిన ముంబై.. పంజాబ్‌కు బ్యాటింగ్ అప్పగింత
- నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై
- పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన వైనం
- రెండు విజయాలతో 7వ స్థానంలో పంజాబ్
ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం నాడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కాసేపటి క్రితం ముగిసిన టాస్‌లో ముంబై విన్నర్‌గా నిలవగా.. తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న రోహిత్ శర్మ సేన.. పంజాబ్ కింగ్స్‌ను ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఇప్పటిదాకా ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ముంబై నాలుగింటిలోనూ ఓటమిపాలైంది. ఐపీఎల్ టైటిళ్లను అందరి కంటే ఎక్కువ సార్లు చేజిక్కించుకున్న ముంబై.. ఇలా పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ మాదిరే ఈ మ్యాచ్‌లో అయినా ముంబై విజయం సాధిస్తుందా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. రెండింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.