వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఘాటు వ్యాఖ్యలు
- వైసీపీ లక్ష కోట్ల అవినీతికి పాల్పడింది
- ఈ కారణంగానే మార్కెట్‌లో రూ.2 వేల నోటు లేదు
- అసమర్థులైన 14 మంది మంత్రులను తొలగించారన్న దేవినేని
ఏపీలో అధికార పార్టీ వైసీపీపైనా, సీఎం జగన్‌పైనా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ గడచిన మూడేళ్లలోనే లక్ష కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడిందని ఆయన విమర్శించారు.
మూడేళ్ల కాలంలోనే లక్ష కోట్లను దండుకున్న కారణంగానే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని జగన్ చెబుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అవినీతి మూలంగానే రూ.2 వేల నోటు మార్కెట్‌లో కనిపించకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. డబ్బుల మదంతోనే వైసీపీ ఎన్నికలకు సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. అసమర్థులైన కారణంగానే కేబినెట్ నుంచి 14 మందిని జగన్ తొలగించారని దేవినేని వ్యాఖ్యానించారు.