ధాన్యం కొనుగోళ్ల‌పై తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

  • ఇత‌ర రాష్ట్రాల ధాన్యం కొనేది లేదన్నా గంగుల 
  • తెలంగాణ న‌లుదిక్కులా 51 చెక్ పోస్టుల ఏర్పాటు 
  • ప్ర‌తి కొనుగోలు కేంద్రంలో ఓ అధికారి ఉంటారని వెల్లడి 
  • ఆధార్ కార్డుల ప‌రిశీల‌న త‌ర్వాతే కొనుగోళ్ల‌న్న గంగుల‌
యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి తెలంగాణ స‌ర్కారు బుధ‌వారం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్ల‌లో కేవ‌లం తెలంగాణ‌కు చెందిన రైతుల ధాన్యాన్ని మాత్ర‌మే కొంటామ‌ని, ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన రైతుల ధాన్యాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కొనేది లేద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ కాసేప‌టి క్రితం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

తెలంగాణ‌లో ధాన్యం కొనుగోళ్ల‌లో ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన ధాన్యం రాకుండా అడ్డుకుంటామ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. ఇందుకోసం తెలంగాణ న‌లుదిక్కులా 51 చెక్ పోస్టుల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ప్ర‌తి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఓ అధికారిని నియ‌మిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల‌లో తెలంగాణ రైతుల ఆధార్ కార్డుల ప‌రిశీల‌న త‌ర్వాతే ముందుకు సాగుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.


More Telugu News