సర్కారీ దవాఖానాల్లోనూ బూస్టర్‌కు అనుమతివ్వండి... కేంద్రానికి హరీశ్ రావు లేఖ
- బూస్టర్ డోసును ప్రకటించిన కేంద్రం
- ప్రైవేట్ కేంద్రాల్లోనే వేసేలా నిర్ణయం
- సర్కారీ దవాఖానాల్లోనూ ఉంచాలంటూ హరీశ్ రావు లేఖ
కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బూస్టర్ డోసును ప్రైవేట్ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటున్న నేపథ్యంలో.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వానికి ఓ కీలక ప్రతిపాదన చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు.
బూస్టర్ డోసును ప్రైవేట్ కేంద్రాలతో పాటు సర్కారీ దవాఖానాల్లోనూ అందుబాటులో ఉండేలా అనుమతించాలని హరీశ్ రావు తన లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బూస్టర్ డోసును ప్రైవేట్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతూనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంచేలా అనుమతించాలని ఆయన కోరారు. హరీశ్ రావు ప్రతిపాదనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.