సరికొత్త వివాదంలో నిర్మల్ జిల్లా కలెక్టర్!
- కలెక్టర్ టెన్నిస్ ఆడుతుంటే వీఆర్ఏలు బంతులు అందించాలట
- 21 మంది వీఆర్ఏలకు విధులు
- జాబితా విడుదల చేసిన తహసీల్దార్
- జాబితా మీడియాకు చిక్కడంతో వివాదం
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కలెక్టర్‌గా కొనసాగుతున్న ముషారఫ్ అలీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కలెక్టర్ టెన్నిస్ ఆట ఆడుతుంటే...బంతులు అందించేందుకు ఏకంగా 21 మంది వీఆర్ఏలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆ జిల్లాలో ఉత్తర్వులు జారీ అయిపోయాయి. ఈ మేరకు నిర్మల్ తహసీల్దార్ శివప్రసాద్.. కలెక్టర్ టెన్నిస్ హెల్పర్లుగా 21 మంది వీఆర్ఏల పేర్లను ప్రస్తావిస్తూ ఓ జాబితాను విడుదల చేశారు.
ఈ జాబితాలోని 21 మంది వీఆర్ఏలలో రోజూ ముగ్గురు చొప్పున సాయంత్రం వేళల్లో కలెక్టర్ నివాసంలోని టెన్నిస్ గ్రౌండ్ వద్ద బంతులు అందించే విధులకు హాజరు కావాలట. ఈ జాబితా మీడియాకు చిక్కడంతో ఒక్కసారిగా కలెక్టర్‌పై వివాదం రేగింది. కలెక్టర్ ఆదేశాలతోనే తహసీల్దార్ ఈ జాబితా రూపొందించారా? లేదంటే తనే అత్యుత్సాహంతో ఈ జాబితా విడుదల చేశారా? అన్నది తెలియరాలేదు.