గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆప్కో షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి అమర్నాథ్
- ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా అమర్నాథ్
- గన్నవరం ఎయిర్‌పోర్టులో నూతనంగా ఆప్కో షోరూమ్
- కార్యక్రమంలో పాల్గొన్న ఆప్కో చైర్మన్, డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ బుధవారం నాడు గన్నవరం ఎయిర్‌పోర్టులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఎయిర్‌పోర్టులో కొత్తగా ప్రారంభించిన ఆప్కో షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహనరావు, డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ వీసీ అండ్ ఎండీ నాగరాణి, ఆప్కో సిబ్బంది పాల్గొన్నారు.