మంత్రి గారు, వెంటనే స్పందించండి.. విడదల రజనీకి బీజేపీ నేత వినతి
- సోషల్ మీడియాలో యాక్టివ్‌గా రజనీ
- అదే మీడియా వేదికగా బీజేపీ నేత ఫిర్యాదు
- కర్నూలు జిల్లాలోని సమస్యను ప్రస్తావిస్తూ ట్వీట్
- రోగులను ఆదుకోవాలంటూ రజనీకి విజ్ఞప్తి
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవిని దక్కించుకున్న పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ... వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమెకు వినతులు వచ్చేశాయి. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే రజనీకి..ఆ సోషల్ మీడియా వేదికగానే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం నాడు ఓ వినతిని పంపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన రజనీకి కర్నూలు జిల్లాలో నెలకొన్న ఓ సమస్యను పరిష్కరించాలని కోరారు.
'కర్నూలు జిల్లా ఆదోని ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఆక్సిజన్ ప్లాంట్ లో విద్యుత్ సమస్య, ఆక్సిజన్ అందక నిన్న రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. రోగులను ఆదుకోండి వైద్య శాఖామంత్రి రజనీ గారు' అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.