అతడు అచ్చం నాలాగే ఆడుతున్నాడు.. టీమిండియా యువ బ్యాటర్ పై రికీ పాంటింగ్ ప్రశంసల వెల్లువ
- పృథ్వీ షాపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం ప్రశంసలు
- తనలో ఉన్నంత ప్రతిభ అతడిలో ఉందని వ్యాఖ్య
- వంద టెస్టులాడే ఆటగాడిగా తీర్చిదిద్దుతానని ధీమా
- హెడ్ కోచ్ గా అంతకన్నా కావాల్సిందేంటని కామెంట్
టీమిండియా యువ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాంచి ఫైర్ మీదున్న పృథ్వీ షాపై పొగడ్తలు కురిపించాడు.
పృథ్వీ ఆటను చాలా దగ్గర్నుంచి గమనిస్తున్నానని, అతడు అచ్చం తన లాగే ఆడుతున్నాడని కొనియాడాడు. తనలో ఎంత ట్యాలెంట్ ఉందో అంతే ప్రతిభ ఆ యువ క్రికెటర్ లో ఉందని చెప్పాడు. టీమిండియాకు వందకు పైగా టెస్టు మ్యాచ్ లాడే ఆటగాడిగా పృథ్వీని తీర్చిదిద్దుతానని స్పష్టం చేశాడు. దేశానికి వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లాడేలా అతడిని మారుస్తానన్నాడు. ఓ హెడ్ కోచ్ కు ఇంతకన్నా కావాల్సింది ఇంకేం ఉంటుందని అన్నాడు.
తాను ముంబై ఇండియన్స్ కు కోచ్ గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ యువకుడని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా అసలు మ్యాచ్ లే ఆడలేదని గుర్తు చేశాడు. కానీ, వాళ్లిప్పుడు టీమిండియాకు ఆడే గొప్ప స్థాయికి ఎదిగారన్నాడు. అదే తాను కోచ్ గా చేయగలిగిందని పేర్కొన్నాడు. వాళ్ల ఆటపరంగా తన ప్రభావం ఉంటే తాను చాలా సంతోషిస్తానన్నాడు.