125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు డిసెంబ‌రులోగా పూర్త‌వుతుంది: కేటీఆర్

  • హైద‌రాబాద్‌లోని పీవీ మార్గ్‌లో విగ్ర‌హం
  • ఏర్పాట్ల ప‌నుల‌ను ప‌రిశీలించిన కేటీఆర్
  • ప‌ర్యాట‌క రంగాన్ని ఆక‌ర్షించేలా మ్యూజియం ఏర్పాటు చేస్తామ‌ని వ్యాఖ్య‌
హైద‌రాబాద్‌లోని పీవీ మార్గ్‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం 125 అడుగుల‌ డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కాంస్య‌ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఆ విగ్ర‌హ ఏర్పాట్ల ప‌నుల‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాటు ప‌లువురు మంత్రు‌లు, ఎమ్మెల్యేలు ఈ రోజు ప‌రిశీలించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబ‌ర్ లోగా ఆ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్ఠిస్తామ‌ని చెప్పారు. గ‌త‌ ఎనిమిది నెల‌లుగా అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటు ప‌నులు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఈ ప‌నుల‌ను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని చెప్పారు. ఇక్క‌డ‌ ప‌ర్యాట‌క రంగాన్ని ఆక‌ర్షించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం వ‌ల్లే తెలంగాణ సాధ్య‌మైంద‌ని అన్నారు. 

             


More Telugu News