ఇక వరుసగా మూడు నెలలు పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. శుభ ముహూర్త తేదీలివే..!

  • ఇవాళ్టి నుంచే ముహూర్తాలు షురూ
  • ఇన్నాళ్లూ కరోనాతో వివాహాలకు ఆటంకాలు
  • ఆంక్షలు ఎత్తేయడంతో ఆడంబరంగా చేసుకునేందుకు అవకాశం
ఇన్నాళ్లూ కరోనా మహమ్మారి పుణ్యమాని పెళ్లిళ్లు చాలా వరకు వాయిదా పడ్డాయి. జరిగిన కొన్ని వివాహాలూ అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలోనే జరిగాయి. అయితే, కొన్ని నెలలుగా పరిస్థితి మళ్లీ మామూలుకు వచ్చింది. పెళ్లిళ్లు కూడా సాధారణంగానే జరుగుతున్నాయి. ఇన్నాళ్లూ ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కూడా దొరుకుతోంది. ఆడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారి కోరికా తీరుతోంది. 

ఇక, ఇప్పుడూ పెళ్లి ముహూర్తాలు వచ్చేశాయి. వరుసగా మూడు నెలల పాటు మంచి ముహూర్తాలున్నాయి. ఈ నెల, వచ్చే నెల, జూన్ లలో చాలా రోజుల పాటు శుభముహూర్తాలున్నాయి. దీంతో ఈ మూడు నెలలూ పెళ్లిళ్లతో మండపాలు కళకళలాడనున్నాయి. డీజే సౌండ్లు, బరాత్ లతో వీధులు హోరెత్తనున్నాయి. 

ఇక, ఇప్పటికే కల్యాణ మండపాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. పెళ్లి కార్డులు, పెళ్లి బట్టల షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఫొటోగ్రాఫర్లు, ట్రావెల్స్, పెళ్లిమండపాలు, పురోహితులు, బ్యాండ్ మేళం వాళ్లకు ఉపాధి దొరుకుతోంది. 

ఇవీ ముహూర్తపు తేదీలు..

ఏప్రిల్: 13, 14, 15, 16, 17, 21, 22, 24
మే: 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25
జూన్: 1, 3, 5, 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23


More Telugu News