'వ్యక్తిగతంగా నాకు ఏ లక్ష్యాలూ లేవు'.. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ధర్మాన వ్యాఖ్యలు
- వైఎస్ జగన్ లక్ష్యాలే తన లక్ష్యాలన్న ధర్మాన
- రెవెన్యూ శాఖను భూ యాజమాన్య శాఖ అంటే బాగుండునని సూచన
- భూముల రీ సర్వేను ఎటువంటి వివాదాలకూ తావు ఇవ్వకుండా చేపడతామన్న మంత్రి
- రెవెన్యూ శాఖలో పనిచేసిన అనుభవం తనకుందన్న ధర్మాన
ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖను భూ యాజమాన్య శాఖ అంటే బాగుండేదని అన్నారు. ఏపీలో భూముల రీ సర్వేను ఎటువంటి వివాదాలకూ తావు ఇవ్వకుండా చేపడతామని తెలిపారు.
ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలంతా భూ యజమానులు అవుతున్నారని ఆయన అన్నారు. రెవెన్యూ శాఖలో పనిచేసిన అనుభవం తనకు ఉందని ఆయన చెప్పారు. తనకు వ్యక్తిగతంగా లక్ష్యాలు ఏమీ లేవని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యాలే తన లక్ష్యాలని ఆయన చెప్పుకొచ్చారు.