గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ కీలక నేతల భేటీ
- భేటీలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి తదితరులు
- టీఆర్ఎస్ సర్కారుపై ఫిర్యాదు
- తెలంగాణలో సమస్యలపై వినతిపత్రం
- ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని విజ్ఞప్తి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో టీపీసీసీ కీలక నేతలు సమావేశమయ్యారు. ఇందులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కీ, వి.హనుమంతరావు తదితరులు ఉన్నారు. తెలంగాణలో పెరిగిపోయిన నిరుద్యోగం, 111 జీవోను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు, డ్రగ్స్, తదితర అంశాలపై గవర్నర్‌కు టీపీసీసీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.
ధాన్యం మొత్తం తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నిన్న సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకు వెంటనే అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని, మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్‌కు టీపీసీసీ నేతలు వినతి పత్రం సమర్పించనున్నారు. ఈ రోజు ఉదయం కూడా హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో టీపీసీసీ నేతలు సమావేశమై ఆయా అంశాలపై చర్చలు జరిపారు.