సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు ప్రకటనపై రేవంత్ రెడ్డి స్పందన
- రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తామన్న కేసీఆర్
- రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచన
- రాహుల్ గాంధీ సభ ఫలితమే కేసీఆర్ నిర్ణయమన్న రేవంత్
- కేసీఆర్ ను నమ్మలేమని వెల్లడి
- చివరి గింజ కొనేవరకు నిఘా పెడతామని స్పష్టీకరణ
తెలంగాణలో రైతుల నుంచి ధాన్యాన్ని తామే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. యాసంగి వడ్లు కొనుగోలు కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాటం సాగించిందని వెల్లడించారు.
ముఖ్యంగా, తెలంగాణలో రైతుల సమస్యలపై రాహుల్ గాంధీ సభతో కేసీఆర్ వడ్లు కొనుగోలు నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్ ను నమ్మలేమని, యాసంగి ధాన్యంలో చివరి గింజను కూడా కొనుగోలు చేసేంత వరకు నిఘా వేస్తామని స్పష్టం చేశారు. తేడా వస్తే సహించేది లేదని హెచ్చరించారు.