'బాదుడే బాదుడు' కార్యక్రమంపై చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్... సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు

  • ఏపీలో పన్నుల మోత
  • బాదుడే బాదుడు అంటూ టీడీపీ ప్రచార కార్యక్రమం
  • ప్రజలకు వివరించాలన్న చంద్రబాబు
  • తాను కూడా ప్రచారంలో పాల్గొంటానని వెల్లడి
బాదుడే బాదుడు ప్రచార కార్యక్రమంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమలో పవర్ హాలిడే ఇచ్చే స్థాయికి ప్రభుత్వం దిగజారిపోయిన వైనాన్ని ప్రజలకు వివరించాలని నేతలకు నిర్దేశించారు. మూడేళ్ల వ్యవధిలో 7 పర్యాయాలు విద్యుత్ చార్జీలు పెంచారని వెల్లడించారు. 

అప్పులు కట్టలేమని శ్రీలంక ప్రకటించినట్టు, ఏపీ కూడా దివాలా తీసినట్టు ప్రకటిస్తారేమోనని సందేహం వ్యక్తం చేశారు. చెత్తపన్నులు, ఆస్తిపన్నుల రూపంలో ప్రజలపై బాదుడే బాదుడు అంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్ నిర్ణయాలతో ప్రజలపై పడుతున్న భారాన్ని వివరించే ఈ కార్యక్రమంలో తాను కూడా పలు చోట్ల పాల్గొంటానని చంద్రబాబు వెల్లడించారు. మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రం ఇవాళ కరెంటు కష్టాల్లోకి జారుకోవడానికి జగన్ విధానాలే కారణమని విమర్శించారు.


More Telugu News