వరి వేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రితోనే ఇవాళ వడ్లు కొనిపిస్తున్నాం... ఇది బీజేపీ విజయం: బండి సంజయ్
- ధాన్యం కొనుగోలు ప్రకటన చేసిన కేసీఆర్
- బీజేపీ దీక్షకు భయపడ్డారన్న బండి సంజయ్
- రైతులు పొగపెడతారని ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. వరి వేస్తే ఉరే అన్న ముఖ్యమంత్రితోనే వడ్లు కొనుగోలు చేయిస్తున్నామని, ఇది బీజేపీ ఘనత అని చెప్పుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఇదే వార్త అని, ఇది బీజేపీ సాధించిన విజయం అంటున్నారని పేర్కొన్నారు.
ధాన్యం కొంటావా? లేక గద్దె దిగిపోతావా? అంటూ కేసీఆర్ కు తాము చేసిన హెచ్చరిక ఫలితాన్నిచ్చిందని వెల్లడించారు. నిన్న తాము చేపట్టిన దీక్ష కేసీఆర్ ను భయపెట్టిందని బండి సంజయ్ అన్నారు. సీఎం మోసం చేస్తున్నారన్న భావన రైతుల్లో కలుగుతున్నట్టు నిఘా వర్గాల నుంచి నివేదిక వచ్చిందని, దాంతో రైతులు తన కుర్చీ కింద పొగపెడతారని భయపడిన కేసీఆర్ ధాన్యం కొనుగోలు ప్రకటన చేశారని వివరించారు.