అమాంతం పెరిగిన అదానీ సంపద... ప్రపంచంలో ఆరోస్థానానికి భారత కుబేరుడు
- వరల్డ్ బిలియనీర్ జాబితా విడుదల చేసిన బ్లూంబెర్గ్
- అదానీ సంపద విలువ 118 బిలియన్ డాలర్లు
- టాప్ లో నిలిచిన ఎలాన్ మస్క్
- రెండో స్థానంలో జెఫ్ బెజోస్
- ముఖేశ్ అంబానీకి 11వ స్థానం
భారత కుబేరుడు గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరోస్థానానికి ఎగబాకారు. ఆయన సంపద ఒక్కరోజులోనే రూ.65,091 కోట్లు పెరిగింది. ఈ క్రమంలో ఆయన గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్ లను వెనక్కి నెట్టారు. అమెరికాలో టెక్ సంస్థల షేర్లకు గడ్డుకాలం నడుస్తుండడంతో పేజ్, బ్రిన్ ల సంపదలో తరుగుదల చోటుచేసుకుంది. ఈ పరిణామం అదానీకి కలిసొచ్చింది. దాంతో ఆయన వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు.
గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ 118 బిలియన్ డాలర్లు అని బ్లూంబెర్గ్ సంస్థ పేర్కొంది. కాగా, భారత్ నుంచి ఈ జాబితా టాప్-10లో చోటు దక్కించుకున్నది అదానీ ఒక్కరే. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ 97 బిలియన్ డాలర్లు కాగా, బ్లూంబెర్గ్ కుబేరుల జాబితాలో ఆయన 11వ స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 249 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 176 బిలియన్ డాలర్లతో రెండోస్థానంలో కొనసాగుతున్నారు. ఫ్రాన్స్ కుబేరుడు ఆర్నాట్ (139 బిలియన్ డాలర్లు) మూడో స్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (130 బిలియన్ డాలర్లు) నాలుగో స్థానంలో, వారెన్ బఫెట్ (127 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో నిలిచారు.