అమెరికాలోని బ్రూక్లిన్ లో కాల్పుల కలకలం... పలువురి మృతి!
- అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తుపాకీ
- రైల్వే స్టేషన్ లో కాల్పులు జరిపిన దుండగుడు
- అనేక మందికి గాయాలు
- బ్రూక్లిన్ లోని 36వ స్ట్రీట్ మూసివేత
తుపాకీ సంస్కృతికి పెట్టింది పేరైన అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. బ్రూక్లిన్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్ లో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో అనేకమందికి బుల్లెట్ గాయాలయ్యాయి. పలువురు వ్యక్తులు రక్తపు గాయాలతో నేలపై పడి ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. వారిలో కొందరు మృతి చెందారని లోకల్ మీడియా వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరైనా మృతి చెందారా? అన్న విషయాన్ని పోలీసులు మాత్రం ఇంతవరకు నిర్ధారించలేదు. అంతేకాదు, మరికొన్ని కథనాల ప్రకారం, ఘటన స్థలంలో పేలుడు పదార్థాలు కూడా లభ్యమైనట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. బ్రూక్లిన్ లోని 36వ స్ట్రీట్ పరిసరాలను మూసివేశారు. పౌరులు ఎవరూ అటుగా వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉదయం వేళ రద్దీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.