బాలకృష్ణతో నా సినిమా డిఫరెంట్ జోనర్లో ఉంటుంది: అనిల్ రావిపూడి
- బాలకృష్ణ పాత్ర కొత్తగా ఉంటుందన్న అనిల్
- ఆయన లుక్ ను డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నానని వెల్లడి
- ప్రతి అంశంలోను వైవిధ్యం కనిపిస్తుందని వ్యాఖ్య
- కామెడీ పాళ్లు కాస్త తగ్గొచ్చన్న అనిల్ రావిపూడి
బాలకృష్ణ 100వ సినిమాను చేయడానికి అనిల్ రావిపూడి చాలా గట్టిగానే ట్రై చేశాడు. అయితే తన 100వ సినిమా చారిత్రక చిత్రం కావాలని బాలకృష్ణ నిర్ణయించుకోవడంతో, ఆ ఛాన్స్ క్రిష్ కి వెళ్లింది. ఆ తరువాత బాలయ్య - అనిల్ ఎవరి ప్రాజెక్టులతో వారు బిజీగా ఉండటం వలన, ఈ కాంబినేషన్ సెట్ కావడానికి కాస్త ఆలస్యమైంది.
ఇక త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "బాలకృష్ణ గారిని ఎలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారో, అలా చూపించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నా మార్కు ఎంటర్టైన్ మెంట్ ను ఎలాగో అలా యాడ్ చేస్తాను. ఇంతకుముందు నా సినిమాల మాదిరిగా ఎక్కువ కామెడీని మాత్రం చేయలేము.
బాలకృష్ణ స్ట్రెంత్ ఏమిటో పట్టుకుని .. ఆయన ఇమేజ్ కి భిన్నంగా వెళ్లకుండా, ఒక డిఫరెంట్ జోనర్లో ఈ కథను నడిపించాలని అనుకుంటున్నాను. బాలకృష్ణ పాత్రను కొత్తగా ఎలా డిజైన్ చేయాలి? ఆయన లుక్ .. మాట .. బాడీ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ఇది వర్కౌట్ అయితే తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.