బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్న సభలో బాంబు పేలుడు
- సొంత జిల్లా నలందలో సీఎం జనసభ
- వేదికకు 20 అడుగుల దూరంలోనే పేలుడు
- దీపావళి టపాసులా పేలిన బాంబు
- స్వల్ప తీవ్రతతో పేలుడు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ నలంద జిల్లాలో ఓ సభలో పాల్గొనగా, బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నలంద నితీశ్ కుమార్ సొంత జిల్లా. ఇవాళ ఆయన సిలావ్ లోని ఉన్నత పాఠశాలలో 'జనసభ' ఏర్పాటు చేశారు. సీఎం వేదికపై కూర్చుని ఉండగా, వేదికకు 20 అడుగుల దూరంలో ఓ బాంబు పేలింది.
అయితే ఆ బాంబు తక్కువ సామర్థ్యం కలది కావడంతో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదు. ఓ దీపావళి టపాసులా పేలిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. కాగా, పోలీసులు దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే నితీశ్ ఉమార్ పై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి చేయడం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్నిరోజుల వ్యవధిలోనే ఈ బాంబు పేలుడు చోటుచేసుకుంది.