ఆయనను మనస్ఫూర్తిగా ఆరాధించండి: జర్నలిస్టులకు మంత్రి వేణుగోపాలకృష్ణ సలహా
- సమాచార ప్రసారశాఖ మంత్రిగా చెల్లుబోయిన
- తన చాంబర్లో అడుగుపెట్టిన వైనం
- జర్నలిస్టులతో చిట్ చాట్
- సీఎం జగన్ ను ఆరాధించాలన్న మంత్రి
- ఇళ్ల స్థలాలు వస్తాయని వెల్లడి
- ఆరా తీస్తే ఫలాలు అందుకోలేరని వ్యాఖ్యలు
ఏపీలో తాజాగా మంత్రులుగా నియమితులైన వారు తమ చాంబర్లలోకి అడుగుపెట్టారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ అమాత్యునిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సరదాగా ముచ్చటిస్తూ, పాత్రికేయులు సీఎం జగన్ ను మనస్ఫూర్తిగా ఆరాధించాలని సూచించారు. పాత్రికేయుల సమస్యలను సీఎం తప్పకుండా పరిష్కరిస్తారని పేర్కొన్నారు.
"ఆరాధించండి... మీకు ఇళ్ల స్థలాలు వస్తాయి. అంతేకానీ ఆరా తీయకండి... అలా చేస్తే సరైన ఫలితాలు రావు" అని వ్యాఖ్యానించారు. పాత్రికేయుల సమస్యల పట్ల తనకు స్పష్టమైన అవగాహన ఉందని, జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను నిబద్ధతతో వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.