తిరుమలను కేవలం ఆదాయ వనరు కోణంలోనే చూస్తున్నారు: భక్తుల తోపులాటపై చంద్రబాబు ఫైర్
- తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాలు
- నాకు తీవ్ర ఆవేదన కలిగించిందన్న చంద్రబాబు
- పసిబిడ్డలతో మండుటెండలో భక్తులు అవస్థలు పడుతున్నారని వ్యాఖ్య
- భక్తులకు దర్శనం, వసతి వంటి అంశాల్లో నిర్లక్ష్యం చూపించారన్న టీడీపీ అధినేత
తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తజనం ఎగబడడంతో తోపులాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్‌లో మండిపడ్డారు.
'తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తుల కష్టాలు తీవ్ర ఆవేదన కలిగించాయి. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే... వారికి కనీసం నీడ కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి అన్న ఆలోచన టీటీడీకి రాకపోవడం దారుణం.
తిరుమలను కేవలం ఆదాయ వనరు కోణంలోనే చూస్తూ... భక్తులకు దర్శనం, వసతి వంటి అంశాల్లో నిర్లక్ష్యం చూపించారు. కొండపైకి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా... శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయి. టీటీడీ వెంటనే మేలుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి' అని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.