కేసీఆర్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలతో బండి సంజయ్ కీలక భేటీ
- టీఆర్ఎస్కు దీటుగా కార్యాచరణ రూపొందిస్తున్న బీజేపీ
- హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం
- బీజేపీ పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జ్లు హాజరు
- డీకే అరుణ, విజయశాంతి, స్వామి గౌడ్, తదితరులు కూడా
కేంద్ర సర్కారుపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని నిన్న ఢిల్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ డెడ్లైన్ విధించారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై చర్చించి, టీఆర్ఎస్కు దీటుగా కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ ముఖ్యనేతలతో కీలక భేటీ అయ్యారు.
హైదరాబాద్లోనీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగుతోంది. బీజేపీ జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జ్లతో పాటు డీకే అరుణ, విజయశాంతి, స్వామిగౌడ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎల్లుండి నుంచి చేపట్టనున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపై కూడా ఇందులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
కాగా, నేడు కేబినెట్ భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ వడ్ల కొనుగోళ్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే, బీజేపీపై తదుపరి పోరాట కార్యాచరణను రూపొందించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కోవాలని బీజేపీ ప్రణాళికలు వేసుకుంటోంది.