ఏపీ ప్రజలు రెండు రకాలుగా భారాన్ని మోస్తున్నారు: లంకా దినకర్
- జగన్ కు ప్రజలు శాశ్వతంగా పవర్ హాలిడే ఇస్తారన్న దినకర్
- జగన్ పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందని వ్యాఖ్య
- వివిధ పన్నులతో ప్రజలపై భారం పెరిగిపోయిందని కామెంట్
ఏపీలో పరిశ్రమలకు పవర్ హలిడే ఇవ్వడంపై బీజేపీ నేత లంకా దినకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలు శాశ్వతంగా పవర్ హాలిడే ఇస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ విద్యుత్ బాదుడుకు రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయని విమర్శించారు.
ఆస్తి పన్నును కూడా జగన్ భారీగా పెంచారని... దీంతో ఆయన పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు, తాగునీటిపై పన్ను, సాగునీటిపై పన్ను, చెత్తపై పన్ను, ఆస్తి పన్నుల బాదుడుతో ప్రజలపై భారం పెరిగిపోయిందని అన్నారు. గృహ విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రత్యక్షంగా, పారిశ్రామిక విద్యుత్ ఛార్జీల బాదుడుతో పరోక్షంగా ప్రజలు రెండు రకాలుగా భారాన్ని మోస్తున్నారని చెప్పారు.