టీచర్ వేసిన శిక్షకు స్పృహ కోల్పోయిన ఏడుగురు విద్యార్థినులు
- ఒడిశాలోని పట్నాగఢ్ లో చోటు చేసుకున్న ఘటన
- హైస్కూల్ కు ఆలస్యంగా వచ్చిన విద్యార్థినులు
- 100 సార్లు సిట్ అప్స్ చేయాలని ఆదేశించిన టీచర్
- శిక్ష తట్టుకోలేక స్పృహ కోల్పోయిన చిన్నారులు
పాఠశాలకు ఆలస్యంగా రావడంతో టీచర్ సహించలేకపోయారు. విద్యార్థినులను 100 సార్లు సిట్ అప్స్ (కూర్చుని లేవడం) చేయాలని ఆదేశించారు. కానీ, అంత కష్టాన్ని ఆ చిన్నారులు తట్టుకోలేకపోయారు. టీచర్ చెప్పినట్టు చేయగా ఏడుగురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారు. ఒడిశాలోని బోలంగిర్ జిల్లా పట్నాగఢ్ లోని బాపూజీ హైస్కూల్లో ఇది జరిగింది.
స్పృహ తప్పిన విద్యార్థినులను అంబులెన్స్ లో పట్నాగఢ్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ‘‘బాలికలను మా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు వారి కండీషన్ బాగోలేదు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైంది. వారి పరిస్థితి నిలకడగా ఉంది’’ అని మెడికల్ ఆఫీసర్ పితాబాష్ షా తెలిపారు.
పాఠశాలలో ప్రార్థన సమయం ముగిసిన తర్వాత బాలికలు వచ్చినట్టు సమాచారం. అందుకే టీచర్ బికాష్ దరువా సిట్ అప్ శిక్ష విధించినట్టు తెలిసింది. దీనిపై విచారణకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఆదేశించారు.