శ్రీకాకుళం జిల్లా రైలు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్

  • శ్రీకాకుళం జిల్లాలో నిలిచిపోయిన సిల్చార్ ఎక్స్ ప్రెస్
  • కిందికి దిగిన ప్రయాణికులు
  • అటుగా వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం
  • ఐదుగురి మృతి.. రూ.2 లక్షల చొప్పున పరిహారం 
శ్రీకాకుళం జిల్లా బాతువ-చీపురుపల్లి మధ్య కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొని ఐదుగురు దుర్మరణం పాలవడం తెలిసిందే. దీనిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురు మరణించారని తెలియడంతో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. 

కోయంబత్తూరు నుంచి సిల్చార్ ఎక్స్ ప్రెస్ రైలు సాంకేతికలోపంతో శ్రీకాకుళం జిల్లాలో ఆగిపోగా, ప్రయాణికులు కొందరు కిందికి దిగారు. అయితే, వారు అవతలి వైపు పట్టాలపై నిల్చున్న సమయంలో అటుగా వస్తున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.


More Telugu News